అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగ ఆత్మస్థైర్యాన్ని కుంగతీసే విధంగా వుందని ఆయన విమర్శించారు.