మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు , భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదీన మజీద్ ర్యాంప్ ఆభివృద్ధికి అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.