ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనలో సహజ వనరుల్ని దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా మైనింగ్ శాఖను పటిష్ఠ పరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సహజ వనరుల్ని కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో ఖనిజాల ఎక్స్‌ప్లోరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.