పురాతన కాలం నుంచి సాగులో ఉన్న 'నవార' బియ్యంలో ఔషధ విలువలు పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారంగానే కాకుండా ఔషధంగానూ ఇవి పని చేస్తాయని పేర్కొంటున్నారు. ఇవి తింటే ఎముకలు, చర్మం, జీర్ణకోశ, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. శ్వాసకోశ, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరచటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.