పలు మండలాల్లో భారీ వర్షాలు నమోదు

67చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, జన్నారం మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఖానాపూర్ పట్టణంతో పాటు ఆ మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలు భారీ వర్షంతో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. అలాగే జన్నారం మండలంలో కూడా గంటకు పైగా భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్