కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార సంఘటనకు పాల్పడిన నిందితుని వెంటనే శిక్షించాలని బిఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ డిమాండ్ చేశారు. ట్రైన్ డాక్టర్ కు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ శనివారం ఉట్నూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సాడిగే రాజ్ కుమార్, భూమన్న, ముజీబ్, గిరి, తదితరులు ఉన్నారు.