బైంసా మండలంలోని ఖత్గాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కొట్టురి ప్రవీణ్ కుమార్ శుక్రవారం బైంసా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే ఈ పాఠశాలలో జాతీయ పతాకం ఎగుర వేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు దీనిపై విద్యాశాఖ అధికారుల స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.