పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

66చూసినవారు
పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
లొకేశ్వరం పోలీసు స్టేషన్ ను శనివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. ఎస్ఐ రాజు కు పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్