బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం అధికారుల వైదిక బృందం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ ప్రజాపాలన-ప్రజావిజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కు చెందిన కూచిపూడి కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ విజయ రామారావు చిన్నారులకు ఆలయం తరుపున లడ్డు ప్రసాదాలను అందజేశారు.