ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. లోకేశ్వరంలో ఏర్పాటు చేసిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. అనంతరం 82 మంది లబ్దిదారులకు దాదాపు రూ. 20 లక్షలు విలువ చేసే చెక్కులు పంచారు.