తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాల మరియు కళాశాల ఆర్మూర్ పాఠశాలను శనివారం ప్రత్యేక అధికారి అయిన ఆలూరు మండల విద్యాశాఖాధికారి M. నరేందర్ సందర్శించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెంచిన హాస్టల్ భోజన చార్జీల మరియు కాస్మొటిక్ చార్జీల పెరుగుదల పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగినది. కళాశాలలోని తరగతి గదులను, వంటగదినీ, వంట సామాగ్రి గదిని పరిశీలించి, తగు సూచనలను చేయడం జరిగింది.