ఆశ వర్కర్ల సమస్యలపై మార్చి 19న చలో కలెక్టరేట్ కు అధిక సంఖ్యలో ఆశ వర్కర్లు హాజరై విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆశ వర్కర్లతో కలిసి ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.