జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో శుక్రవారం గణిత శాస్త్రం ఫోరం ఆధ్వర్యంలో ఆలూరు మండల స్థాయి గణిత శాస్త్ర ప్రతిభ పోటీలను నిర్వహించడం జరిగినది. విజేతలకు ఆలూరు మండల విద్యాధికారి యం. నరేందర్ బహుమతులను ప్రధానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పీఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ అశ్వఖ్ అహ్మద్, ఆలూరు మండల పీఆర్టియు ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు