నందిపేట ఉమ్మెడ, కొండూరు గ్రామాల మధ్య గుట్ట పరిసర ప్రాంతాల్లో వారం క్రితం అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాల్లో సేకరించిన ఆధారాల ప్రకారం అది పులి కాదని అడవి పిల్లి అని దాని అడుగుల ఆధారంగా నిర్ధారించారు. కానీ మంగళవారం గొర్రెల మందపై దాడి చేయడంతో అది చూసిన గొర్రెల కాపర్లు దానిపై రాళ్లు విసరడంతో అది పారిపోయింది. చారలతో అది అచ్చం పులి పిల్ల లాగే ఉందని కచ్చితంగా అది పులి పిల్లేనని గొర్రెల కాపర్లు తెలుపుతున్నారు.