నిజామాబాద్: కారు యాక్సిడెంట్.. బాలుడి పరిస్థితి విషమం

75చూసినవారు
నిజామాబాద్: కారు యాక్సిడెంట్.. బాలుడి పరిస్థితి విషమం
నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు సైకిల్ ను ఢీకొన్న ఘటన తెలిసిందే. ఈ ఘటనలో సైకిల్ నడుపుతున్న చంద్రశేఖర్ కాలనీకి చెందిన సయ్యద్ షాహిజాద్ (11) తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు 3టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్