నిజామాబాద్: ముగ్గురు అన్నదమ్ములపై కత్తులతో దాడి

69చూసినవారు
నిజామాబాద్: ముగ్గురు అన్నదమ్ములపై కత్తులతో దాడి
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలో శనివారం దారుణం జరిగింది. రేషన్ బియ్యం పంపిణీ విషయంలో జరిగిన గొడవ కత్తి పోట్లకు దారి తీయగా ముగ్గురు అన్నదమ్ములు గాయపడ్డారు. జ్యోతిరామ్ అనే వ్యక్తి భార్య అమ్రాడ్ తండా గ్రామంలో రేషన్ డీలర్. అయితే తమకు బియ్యం పోయడం లేదంటూ అన్నాదమ్ముళ్లు విక్రమ్, పీర్ సింగ్ గొడవపడ్డారు. అక్కడే ఉన్న జ్యోతిరామ్ తోపాటు ఆయన సోదరులు శ్రీనివాస్, రాజునాయక్ అడ్డుకోగా, ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసకువచ్చిన విక్రమ్, పీర్ సింగ్ ముగ్గురు సోదరులపై దాడి చేశారు.

సంబంధిత పోస్ట్