నిజామాబాద్: ఆగని నకిలీ ఏజెంట్ల మోసాలు
నందిపేట మండలానికి చెందిన ఓ ఏజెంట్ మంచి వేతనం ఇప్పిస్తానని చెప్పి 30 మందిని నమ్మించి గల్ఫ్ దేశాలకు పంపించాడు. అక్కడ పాస్స్పోర్టులు తీసుకుని వారి గుర్తింపు కార్డులతో స్థానిక బ్యాంకుల్లో రుణాలు పొందాడు. పని చూపకుండా అడిగినపుడు ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చేవాడు. అనుమానం వచ్చి నిలదీయగా అసలు విషయం బయట పడింది. ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసారు.