వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆదేశాల మేరకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందికి గురవుతున్నారని, వైఫై కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయానికి విద్యార్థులు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.