వర్ని మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన శ్యామలను రెండవ కాన్పు నిమిత్తం 108 అంబులెన్స్ లో బోధన్ తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమవడంతో అంబులెన్స్ సిబ్బంది భవానిపేట్ గ్రామం వద్ద అంబులెన్స్ నిలిపి ఈ ఆర్ సీ పీ వైద్యుడు వినయ్ సలహా మేరకు అంబులెన్స్ లో సుఖ ప్రసవం చేశారు. దాంతో శ్యామల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలను క్షేమంగా బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.