రామారెడ్డి: చెరువులో చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు

76చూసినవారు
రామారెడ్డి: చెరువులో చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు
చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటన రామారెడ్డి మండలం బట్టుతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రవి శుక్రవారం పక్కనే ఉన్న దామెర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చీకటి పడినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. చెరువులోకి వెళ్లాడని చూసిన వారు చెప్పడంతో రాత్రి వరకు గాలించారు. ఫలితం లేకపోవడంతో శనివారం ఫైర్, పోలీసు సిబ్బంది చెరువు వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్