దేవరకద్ర: విశ్రాంతి ఉద్యోగుల భవనం, సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్రాంతి ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.