లగచర్ల రైతులకు వేసిన బేడీలపై శాసనమండలిలో చర్చించాలని సోమవారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టడంతో అందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో శాసనమండలి ప్రధాన ద్వారం వద్ద బిఆర్ఎస్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.