దేవరకద్ర: పోలీసు లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింత కుంట మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కె. వెంకటేష్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందారు. కాగా ఆయన స్వగ్రామంలో అంతక్రియలను బుధవారం సాయంత్రం పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సురేష్, ఎస్ఐ శేఖర్, పలువురు పోలీస్ సిబ్బంది పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని, ఒకరికి ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు.