సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఎఫ్ఎసీ) ప్రిన్సిపాల్ గా రామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ పెద్ది నారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు, ఇప్పటివరకు ఇక్కడ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఎం. డి అజ్మాల్ ఖాన్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ కళాశాల అధ్యాపక బృందానికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.