సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి కుల గణనలో సర్వేలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. సర్వేలో భాగంగా ప్రతి డేటాఎంట్రీ ఆపరేటర్ కు గ్రామ పంచాయతీల ఎన్యూమరేటర్ బ్లాకుల వారీగా దరఖాస్తుల ఇవ్వడం జరుగుతుందన్నారు.