నిజామాబాద్: మురికి కాల్వలో పడిపోయి వ్యక్తి మృతి

63చూసినవారు
నిజామాబాద్: మురికి కాల్వలో పడిపోయి వ్యక్తి మృతి
మురికి కాల్వలో పడిపోయి ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం నగరంలోని ఐదో ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. న్యాల్ కల్ రోడ్డులో గల డ్రెయినేజీలో మూత్ర విసర్జన చేసే సమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఐదో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్