మేయర్ భర్త దండు శేఖర్‌పై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీఆర్‌ఎస్ నగరాధ్యక్షుడు సిర్పరాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్, నాయకులు నీలగిరి రాజు, గాండ్ల లింగం తదితరులు ఉన్నారు.