నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కోమలి అనే బాలిక సెయింట్ జేవియర్స్ పాఠశాలలో రెండో తరగతి చదువుతుంది. పాఠశాలలో భోగి వేడుకలు నిర్వహిస్తుండగా టీచర్ పెట్రోల్ పోస్తుండగా బాలికపై పడింది. దీంతో ఆమె రెండు కళ్ళు కాలిపోయాయి. బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.