టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో ‘జాట్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయగా అందరిని ఆకట్టుకుంది. పవర్‌ఫుల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. తాజాగా, శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి ‘ఓ రామ శ్రీ రామ’ పాట విడుదలైంది. కాగా, ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.