ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేయనుంది. ఈ కార్యక్రమానికి సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. రేపు పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించి, రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.