పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన ఆకుల కొమురయ్య గౌడ్ ఆదివారం మధ్యాహ్నం వృత్తిలో భాగంగా ఈత చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకుజారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు అవ్వడంతో సహచర గీత కార్మికులు మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.