ప్రభుత్వ పథకాల అమలుకు జరుగుతున్న లబ్దిదారుల ఎంపికపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందన్నారు. లబ్దిదారుల జాబితా ఎక్కడో తయారు కాదన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు లబ్దిదారులను గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంపిక ఉంటుందని.. అపోహలు, అవమానాలు పెట్టుకోవద్దన్నారు.