తెలంగాణలో పోలీసులు గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేరి, వాటిలో జరుగుతున్న చర్చలను పర్యవేక్షిస్తున్నారట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయట. గ్రామాల నుంచి స్టేషన్‌కి వచ్చే వారిని గ్రూపుల వివరాలు అడిగి, వాటిలో చేర్చాలని పోలీసులు కోరుతున్నారట. తెలంగాణలో మొత్తం 3 లక్షల గ్రూపుల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం.