ప్రధాని మోదీపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మరోసారి మండిపడ్డారు. ప్రధాని మోదీ అయోధ్యలో 13 వేల ఎకరాల ఆర్మీ భూమిని తన స్నేహితుడు అదానీకి ఇచ్చారని ఆరోపించారు. దేశం మొత్తం అదానీకే అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాముడు కాదు, సాధారణ పౌరుడూ కాదని అన్నారు. అదానీ మనీలాండరింగ్ కుంభకోణంలో సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్‌కి లింక్ చేస్తూ హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేసిన తర్వాత సంజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.