గురుకుల బాటలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోని శేరిగుడా సాంఘిక సంక్షేమ గురుకులం, కస్తూరిభా గాంధీ వసతి గృహాలను ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, ఆర్ ఎస్ ప్రవీణ్ సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురుకులాల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పలు సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.