రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో ఆదివారం చిరుత సంచారించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. గ్రామంలోకి వచ్చిన చిరుతను చూసి భయాందోళనకు గురైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. వెలిమినేడు గ్రామానికి అటవీశాఖ అధికారులు వచ్చి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. పరిశీలన అనంతరం గ్రామంలోకి చిరుత రాలేదని అడవి పిల్లి సంచారించినట్లు అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.