క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి శంకరపల్లి మండలం మోకిలాలోని తెలంగాణ క్రీడ ప్రాంగణంలో సీఎం కప్ క్రీడాల్లో ముగింపు సందర్భంగా గురువారం విజేతలకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య బహుమతులు అందజేసారు.