కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టారు: కేటీఆర్
కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని రేవంత్ వ్యతిరేకించారని.. ఇప్పుడు కొడంగల్‌లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సిద్ధమయ్యారని అన్నారు. ఫార్మా కంపెనీ మాకొద్దని స్థానికులు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.