కోస్గి ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. మందుల కొరతపై డ్యూటీ డాక్టర్ అనుదిప్ ను అడిగి తెలుసుకున్నారు. పెయిన్ కిల్లర్, టీటీ ఇంజక్షన్ల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్లప్పుడూ మందులు అందుబాటులో పెట్టుకోవాలని, వైద్యుల భద్రతకు పోలీసులను ఏర్పాటు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కు చెప్పారు.