కాకతీయ నగర్ బ్రాంచ్ లో జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్యూరియాసిటీ కార్నివాల్ అనే పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, టూరిజం ఎక్స్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఏసీపీ కృష్ణయ్య, సైన్స్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మాధవి, కాకతీయ హెడ్ ఆఫీస్ సిబ్బంది, కాలనీవాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.