ఎల్బీ నగర్ శాతవాహన కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా మహిళలకు శాతవాహన కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.