ఆమనగల్లు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా యాదిలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కోర్టు ఆవరణలో సీనియర్ న్యాయవాది లక్ష్మణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలలో అధ్యక్షులుగా యాదిలాల్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు యాదవ్, సంయుక్త కార్యదర్శిగా విజయకుమార్, కోశాధికారిగా కొప్పు కృష్ణ, లైబ్రేరియన్ గా వస్పుల మల్లేష్ ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించారు.