విద్యార్థుల విద్యాభ్యాసం, వసతుల కల్పనకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి చెప్పారు. శనివారం కాస్మోటిక్ డైట్ కార్యక్రమంలో భాగంగా కడ్తాల్ గిరిజన బాలుర వసతి గృహంలో పాల్గొన్న ఆయన ప్రేయర్ బ్యాండ్ కోసం పదివేల రూపాయల విరాళాన్ని విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు.