విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసమే ప్రభుత్వం నూతన డైట్, కాస్మోటిక్ మెనూ తీసుకొచ్చిందని ఎంపీడీవో పద్మావతి చెప్పారు. శనివారం మాడుగుల ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతన డైట్, కాస్మెటిక్ మెనూను ఆమె అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పెంచిన డైట్ కాస్మెటిక్ మెనూ లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.