హైదరాబాద్ మీర్‌పేట్ PS పరిధిలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. DRDO కాంట్రాక్టు ఉద్యోగి గురుమూర్తి అనుమానంతో భార్య వెంకటమాధవిని ముక్కలుగా నరికి చంపాడు. తర్వాత శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఈనెల 13 నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు..హత్య చేసింది గురుమూర్తేనని తేల్చారు. చెరువునుంచి మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.