అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గ్రేటర్ హైదరాబాద్ సదస్సును మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని ఏబీవీపీ సెంట్రల్ యూనివర్శిటీల జాతీయ కన్వీనర్ హెచ్ సియూ శాఖ అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. ఈ సదస్సును నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తారన్నారు. సదస్సులో పెద్ద సంఖ్యలో ఏబీవీపీ నాయకులు, సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు.