రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అత్తాపూర్ చౌరస్తా వద్ద పిల్లర్ నెంబర్ 142 వద్ద బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న లారీ బ్రేక్ ఫెయిల్ ఘటన అందరికీ తెలిసిందే. ప్రమాదానికి కారణమైన శిధిలాలు నిన్న సాయంత్రం 6 గంటల వరకు తొలగించకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన అత్తాపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాయి యాదవ్ శిధిలాలను స్వయంగా తొలగించారు.