గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులబ్గూర్ గ్రామ శివారులోని ఒక రైస్ మిల్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని శివం లభ్యమయింది. ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ మృతుని వయస్సు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. శవాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గుర్తిస్తే 8612656746, 8712656719 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.