సంగారెడ్డి: అధికారులకు మంత్రి సమీక్ష సమావేశం
జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డిలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. రాబోయే వేసవిలో మంచినీటి సమస్య లేకుండా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.