సంగారెడ్డి: రెండో అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి మండలం కొట్లపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న స్వాతి అనే విద్యార్థిని రెండో అంతస్తు నుంచి కిందికి దూకింది. విద్యార్థిని వెంటనే ఆంబులెన్స్ లో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. విద్యార్థిని మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.